ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఎప్పుడంటే - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఎప్పుడంటే

March 24, 2020

10th Class

కరోనా వైరస్ వల్ల ఏపీలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగితా వారంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ పదవ తరగతి పరీక్షలకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని భావించి వాయిదా వేశారు. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను మార్చి 31 తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. రాత్రి 8 గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడ  కూడా నలుగురికి మించి ఎక్కువ మంది ఉండకూడదని సూచించారు. నిత్యావసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలన్నారు. రెండు కిలోమీటర్ల పరిధిలోపు మాత్రమే వాహన ప్రయాణానికి అనుమతి ఉందన్నారు.