Home > ఆంధ్రప్రదేశ్ > మీది కులాంతర వివాహమా? రూ. 2.5 లక్షల కోసం ఇలా అప్లయ్ చేసుకోండి..

మీది కులాంతర వివాహమా? రూ. 2.5 లక్షల కోసం ఇలా అప్లయ్ చేసుకోండి..

మీది కులాంతర వివాహమా? రూ. 2.5 లక్షల కోసం ఇలా అప్లయ్ చేసుకోండి..
X

పేదల పెళ్లిళ్లకే కాకుండా కులాంతర వివాహం చేసుకునే జంటలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి కానుక కింద ఆర్థిక సాయం చేస్తున్నాయి. అయితే ఆయా పథకాలపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా జంటలు వినియోగించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘డాక్ట‌ర్ అంబేద్కర్ స్కీమ్ ఫ‌ర్ సోష‌ల్ ఇంటెగ్రేష‌న్ త్రూ ఇంట‌ర్‌క్యాస్ట్ మేరేజెస్’ పథకం ఒకటి. దీన్ని 2013లోనే ప్రారంభించినా తెలుగు రాష్ట్రాల్లో నామమాత్రంగా వినియోగించుకుంటన్నారు. కులాంతర వివాహానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉండి, సకాలలో దరఖాస్తు చేసుకుంటే ‘అంబేద్కర్’ రెండున్నర లక్షల కానుక కచ్చితంగా అందుతుంది. అంబేడ్కర్ ఫౌండేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

ఎవరు అర్హులు?

జంటలో ఎవరో ఒకరు కచ్చితంగా దళితులై ఉండాలి. ఆదాయపరిమితి నిబంధన లేదు. ఇద్దరికీ 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు నిండి, ఇద్దరికీ తొలి పెళ్లి అయి ఉండాలి. పెళ్లి హిందూ వివాహ చ‌ట్టం కింద సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నమోదు చేయించుకుని ఉండాలి. చట్ట‌బ‌ద్ధంగా పెళ్లి చేసుకున్నామని హమీ పత్రం, కులధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వివరాలు సమర్పించాలి. పెళ్లయిన ఏడాదిలోపలే దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రాల్లో అమలయ్యే పెళ్లికానుక పథకాల కింద డబ్బు తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని మినహాయించుకుని ఇస్తారు. దంపతుల్లో ఒకరు హిందూయేతర వ్యక్తి అయితే సంబంధితన పత్రాన్ని పొందుపర్చాలి. అంబేడ్కర్ కానుక మొత్తాన్ని దంపతులు జాయింట్ బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. 2.5 లక్షలను ఒకేసారి గాని, విడతల వారీగాగాని మంజూరు చేస్తారు. తుది నిర్ణయం అంబేద్కర్ ఫౌండేషన్‌దే.

దరఖాస్తు ఎలా?

దంపతులు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లలో ఎవరో ఒకరి ద్వారా సిఫారసు లేఖ తీసుకోవాలి. దాన్ని ఇతర పత్రాలతో కలిపి ఢిల్లీలోని అంబేడ్కర్ ఫౌండేషన్‌ చిరునామాకు పాంపాలి. పంపాలి. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పెళ్లికానుక పథకాల వెబ్ సైట్లలోనూ ఈ పథాకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login లో దరఖాస్తు చేసేకోవాలి. తెలంగాణలో https://telanganaepass.cgg.gov.in/InterCasteMarriageReg.do

అంబేద్కర్ ఫౌండేషన్ అడ్రస్

Dr. Ambedkar Foundation

9th Floor, Jeevan Prakash,

25, KG Marg, Connaught Place,

New Delhi, Delhi 110001

Email [email protected]

Phone numbers.. 011-26180211, 8588038789

Updated : 18 Sep 2023 3:06 PM GMT
Tags:    
Next Story
Share it
Top