Home > ఆంధ్రప్రదేశ్ > TDP Vs YCP : రేయ్ కూర్చోరా... పార్లమెంటులో నాయుడిపై రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

TDP Vs YCP : రేయ్ కూర్చోరా... పార్లమెంటులో నాయుడిపై రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

TDP Vs YCP : రేయ్ కూర్చోరా... పార్లమెంటులో నాయుడిపై రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
X

తెలుగు రాజకీయ నాయకులు అసెంబ్లీల్లో తిట్టిపోసుకునే అద్బుతకళను పార్లమెంటులో కూడా ప్రదర్శించారు. ‘ఒరేయ్, తరేయ్ భాషతో’ పరువు తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై సోమవారం పార్లమెంటులో టీడీపీ, వైసీపీ పార్టీల ఎంపీలు పరస్పర విమర్శలు సంధించుకున్నారు. చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘రేయ్ నువ్వు కూర్చోరా బాబూ’’ అని గేలి చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని మిథున్ చెప్పారు. అన్నీ అబద్ధాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. తనకు అడ్డు చెబుతావా అంటూ మిథున్ రెడ్డి ఏకవచనంతో దుర్భాషలాడారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశ చట్టసభలో సంస్కారం లేకుండా నోరు పారేసుకున్నందుకు క్షమాపణ చెప్పాలని, సహచర ఎంపీను అలా కించపరచడం సరికాదని అన్నారు. మిథున్ రెడ్డిని కూడా అరేయ్ అంటే ఆయన గౌరవం ఏమవుతుందని అన్నారు. కాగా, అంతకు ముందు ఎంపీ గల్లా జయదేవ్.. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమని, ఆయనను వెంటనే విడుదల చేయించాలని కేంద్రాన్ని కోరారు.

Updated : 18 Sep 2023 1:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top