Andhra Pradesh advisor sajjala Ramakrishna reddy on Telangana cm kcr allegation
mictv telugu

కేసీఆర్ చెప్పింది నిజం కాదు.. సజ్జల రామకృష్ణారెడ్డి

November 18, 2022

Andhra Pradesh advisor sajjala Ramakrishna reddy on Telangana cm kcr allegation

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ ప్రభుత్వంతోపాటు ఏపీలోని వైకాపా ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం కాస్త ఆలస్యంగా స్పందించింది. ఏపీలో ప్రస్తుతం అలాంటి పరిస్థితేమీ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ‘‘కేసీఆర్ తెలంగాణ రాజకీయాల గురించి అలా అనుండొచ్చు.

మా రాష్ట్రంలో అలాంటి లేదు. జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది. జగన్‌కు వేరే రాష్ట్రాల విషయాల్లో ఆసక్తి లేదు,’’ అని శుక్రవారం అన్నారు. చంద్రబాబు అధికారం కోసం ప్రజల దగ్గర కల్లిబొల్లి కన్నీళ్లు కారుస్తున్నాడని ప్రజలు అతణ్ని నమ్మరని సజ్జల అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనడానికి ప్రయత్నోందని, తన కుమార్తెను కూడా మారమన్నారని చెబుతూ కేసీఆర్ ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను అడ్డదారిలో కూలగొట్టేందుకు కమల నాథులు కుట్రలు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, రాజస్తాన్ రాష్ట్రాల్లోని సర్కార్లను కూల్చడానికి కుట్ర జరుగుతోందన్నారు.