శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టండి.. ఏపీ స్పీకర్ తమ్మినేని - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టండి.. ఏపీ స్పీకర్ తమ్మినేని

May 25, 2022

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం ముమ్మాటికీ సరైందేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అమలాపురంలో జరిగిన విధ్వంసకాండపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ‘జిల్లాలకు గొప్ప నాయకుల పేర్లు పెడితే తప్పేమిటి? అంబేద్కర్‌ రాజ్యాంగ ప్రయోజనాలు పొందుకు ఆయన పేరును వ్యతిరేకిస్తారా? కులమతాలు, జాతుల పేరుతో విద్వేషాలు రాజేయడం మంచింది కాదు’ అని అన్నారు. జగన్ సీఎం అయ్యాకే అన్ని సమాజిక వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. అమలాపురం అల్లర్ల వెనుక ఎవరున్నా వదిలేది లేదని, వారి భరతం పడతామని హెచ్చరించారు. ‘శ్రీకాకుళం జిల్లాకు అంబేద్కర్-2 జిల్లాగా పేరు పెట్టమనండి. అప్పుడు ఏ పార్టీ అడ్డుకుంటుందో నేను చూస్తా’ అని హెచ్చరించారు.