ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర లభించింది. ఈ భేటీలో 45 అంశాలను ప్రస్తావించగా 15 అంశాలకు సీఎం ఆమోద ముద్ర వేశారు. కేబినెట్ భేటీకి సంబంధించిన కీలకమైన విషయాలను మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. హైస్కూళ్ళలో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర లభించిందని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో 5388 మంది నైట్ వాచ్ మెన్లను నియమించనున్నారు.
గ్రంథాలయాల్లో పని చేసే సిబ్బందికి, ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ పదీవి విరమణ వయసును 62కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లుకు ఆమోదం తెలపింది సర్కార్.
అన్ని దేవస్థానాల బోర్డులలో నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించడంతో పాటు క్షుర ఖర్మలు చేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.20వేలు కమిషన్ ఇవ్వాలన్న ప్రతిపాదదను ఆమోదించింది. పట్టాదారు పాసు పుస్తకం ఆడిరెన్స్ సవరణకు కేబినెట ఆమోదముద్ర వేసిందన్నారు మంత్రి.