ఏపీ క్యాబినెట్ మీట్..11వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ క్యాబినెట్ మీట్..11వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు

January 20, 2020

lktyu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కొనసాగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లను ప్రవేశపెడతారు. ఈరోజు దానిని పాస్ చేసి రేపు మండలిలో ప్రవేశపెడతారు.

 

* హైపవర్ కమిటీ నివేదికకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 

* పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం వేసింది.

* రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.

* రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారు.

* సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం లభించింది.

* రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం. 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని    నిర్ణయం తీసుకున్నారు.

* అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

* మూడు అసెంబ్లీ సమావేశాలు అమరవతిలోనే నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయం.

* విశాఖకు సచివాలయం, హెచ్‌వోడి కార్యాలయాలను తరలించాలని క్యాబినెట్ నిర్ణయం.

* కర్నూలులో హైకోర్టుకు మంత్రివర్గం ఆమోదం.