ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎంపీ మాధవి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్

October 23, 2019

mp madhavi.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్‌ వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. మాధవి, శివప్రసాద్‌ దంపతులను సీఎం ఆశీర్వదించారు. రుషికొండలోని సాయిప్రియా బీచ్ రిసార్ట్స్‌లో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. రిసెప్షన్‌ వేడుకలో బంధుమిత్రులతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.  

ఎంపీ మాధవి, శివప్రసాద్‌ వివాహం కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోని మాధవి స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంగతి తెలిసిందే. తన బాల్యమిత్రుడు శివప్రసాద్‌ను మాధవి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి వైఎస్సార్‌‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. గతంలో టీచర్‌గా పనిచేసిన మాధవి ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మాధవి 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. వివాహానికి ముందు ఈ జంట తీసుకున్న ప్రివెడ్డింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.