ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల్లో ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నాయకులు, మాతృభాషా ప్రేమికులు భగ్గుమంటున్నారు. నిన్న ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు.
సీఎం గారి పవర్ ఫుల్ పంచ్ :సినిమా యాక్టర్ పవన్ కల్యాణ్ గారు…మీకు ముగ్గురు భార్యలున్నారు , నలుగురో , ఐదుగురో పిల్లలు ఉన్నారు , వారిని ఏ మీడియంలో చదివిస్తున్నారు..?◆ బాబు, వెంకయ్యనాయుడు మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారు…?
Posted by Nagarjuna Yadav Yanamala on Sunday, 10 November 2019
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…”అయ్యా పవన్ కల్యాణ్ గారూ… మీకు ముగ్గురు భార్యలు. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తున్నారో అడుగుతున్నాను. కారణం ఏంటంటే, ఇవాళ, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనం. మన రాష్ట్రం నష్టపోతుంది. జాతి నష్టపోతుంది. మనం పిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే, అతిగొప్ప ఆస్తి చదువు. ఆ చదువు ప్రతి పేదవాడికీ చెందాలి. ఏ పిల్లాడూ, తల్లీ అందుకోసం అప్పులపాలు కాకుండా చూడాలన్నదే నా ఉద్దేశం” అని అన్నారు. తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ అధికారభాష సంఘం ఏం చేస్తుంది? భాష మరియు సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైసీపీ నాయకత్వం తెలంగాణ సీఎం కేసీఆర్ నుండి పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.