సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు - MicTv.in - Telugu News
mictv telugu

సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

December 12, 2019

Andhra pradesh cm jagan disha act

మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు.

మహిళలపై లైంగిక దాడులకు పాల్పడితే 21 రోజుల్లోనే విచారణ జరిపి.. తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఏపీ మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు రక్షణ కోసం కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. దీనిపై ఏపీ మహిళలు హర్హం వ్యక్తం చేస్తున్నారు.