పాదయాత్రలోనే ఇంగ్లీష్ మీడియం హామీ..సీఎం జగన్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

పాదయాత్రలోనే ఇంగ్లీష్ మీడియం హామీ..సీఎం జగన్ వీడియో

November 12, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. సోమవారం సీఎం జగన్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌, ప్రతిపక్షనేత చంద్రబాబులపై వ్యక్తిగత విమర్శలు చేశారు. 

లోకేష్, పవన్ ఇది కూడా ట్వీట్ చేస్తే బాగుంటుంది… పాదయాత్ర లో నే ప్రజలు అడిగారు,మాట ఇచ్చిన జగన్ గారు….

Posted by బాబుల్ తుమ్మ on Monday, 11 November 2019

నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లల చదువులపై విమర్శలు చేశారు. వారు ఏ మీడియంలో చదువుతున్నారో తెలపాలన్నారు. దీనికి కౌంటర్‌గా నారా లోకేష్ ట్వీట్ చేస్తూ మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నాని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే జగన్ ఇంగ్లీష్ మీడియం హామీని పాదయాత్ర సమయంలోనే ఇచ్చారని తెలుస్తోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఓ సామాన్యుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధించాలని కోరాడు. దానికి జగన్ ఒకే చెప్పినట్టుగా ఆ వీడియోలో ఉంది. అప్పుడు ఇచ్చిన హామీనే జగన్ ఇప్పుడు నెరవేర్చారని నెటిజన్లు అంటున్నారు.