అయోధ్య తీర్పుపై స్పందించిన జగన్.. - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పుపై స్పందించిన జగన్..

November 9, 2019

అయోధ్య వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తూ ఈ రోజు సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తీర్పు తమక అసంతృప్తి కలిగించిందని సున్నీ వక్ఫ్ బోర్డు చెబుతోంటే, ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని హిందుత్వ సంఘాలు వేడుకలు చేసుకుంటున్నాయి. మరోపక్క.. తీర్పుతో సంబంధం లేకుండా ప్రజలందరూ సంయమనం పాటించి, శాంతిసామరస్యాలతో మెగాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తీర్పుపై స్పందించిన తొలి ముఖ్యమంత్రి జగనే. 

‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను..’ అని ఆయన కోరారు. అయోధ్య వివాదాస్ప స్థలాన్ని రామజన్మభూమి న్యాస్‌కు కేటాయించిన సుప్రీం కోర్టు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాలను ముస్లింలకు ఇవ్వాలని ఆదేశించింది.