జగన్ శుభవార్త.. రూ. 25కే కిలో ఉల్లి - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ శుభవార్త.. రూ. 25కే కిలో ఉల్లి

December 3, 2019

Andhra pradesh cm jagan ordered to sell kg onion for 25 rupees

ఉల్లి ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఉల్లి కోస్తున్నప్పుడు మాత్రమే కాదు.. కొంటునప్పుడు కూడా కన్నీళ్లు వస్తున్నాయి. మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ శుభవార్త తెలిపారు. మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతీ రోజూ రైతు బజార్‌లలో ఉల్లి విక్రయాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఉల్లి ధరలు తగ్గే వరకు రైతు బజార్‌లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.25కే కిలో ఉల్లిని అమ్మాలని అధికారులకు తెలిపారు.

ఉల్లి విషయంలో ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడినా పర్లేదని సీఎం జగన్ అధికారులతో తెలిపారు. ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేయాలని చెప్పారు. గడిచిన 18 రోజుల్లో 16వేల క్వింటాళ్ల ఉల్లిని జగన్ ప్రభుత్వం సరఫరా చేసింది. 18 రోజుల్లో రూ.9.50 కోట్ల ఖర్చుతో ఉల్లిని కొనుగోలు చేసింది. దీంతో ప్రభుత్వంపై రూ.5.83 కోట్ల ఆర్థిక భారం పడింది. ఇక అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ వెల్లడించారు. మార్కెటింగ్, విజిలెన్స్, పౌర సరఫరాల శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు.