శారదా పీఠంలో ఏపీ సీఎం జగన్‌, తలసాని - MicTv.in - Telugu News
mictv telugu

శారదా పీఠంలో ఏపీ సీఎం జగన్‌, తలసాని

February 3, 2020

jagan....

విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిరి వాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హాజరైయారు. సీఎంకు శారదా పీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఆశీస్సులు అందుకున్న సీఎం జగన్.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శారదాపీఠం ప్రాంగణంలో గోమాతకు పూజలు చేశారు. శారదా పీఠం వార్షిక మహోత్సవం సందర్భంగా విశ్వశాంతి మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి చేపట్టారు. మహాపూర్ణాహుతిలో సీఎం జగన్ పాల్గొన్నారు. స్వయం జ్యోతి మండపాన్ని ప్రారంభించారు.

సీఎం జగన్ వెంట ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కురసాల కన్నబాబు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా శారదా పీఠాన్ని సందర్శించనున్నారు. జగన్ సీఎం హోదాలో శారదాపీఠానికి రావడం ఇది రెండో సారి.