టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా.. 126 మందితో... - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా.. 126 మందితో…

March 14, 2019

అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ఏకంగా 126 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని విడుదల చేశారు. విజయావకాశాలు, సామాజిక వర్గాల సమీకరణాలను, ఇతర కలసి వచ్చే అంశాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు నెల రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సైకిల్ పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. తొలి జాబితాలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గాను 150+ సాధించాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. లోక్ సభ స్థానాల అభ్యర్థులను శుక్రవారం ప్రకటిస్తామన్నారు.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కోసం ఈ ఫైల్‌ను క్లిక్ చేయండి 

 126 Constituencies_1