అలా చేస్తే నాకు బాబుకు తేడా ఉండదు.. జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

అలా చేస్తే నాకు బాబుకు తేడా ఉండదు.. జగన్

June 13, 2019

Andhra pradesh Cm Ys Jagan sensational comments on Tdp Chief Chandrababu Naidu.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌గా వైసీపీ ఎమ్మెల్యే సీతారాంకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో స్పందించారు.

‘తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేలను మేం తీసుకుంటే రాజీనామా చేయించే తీసకుంటాం. టీడీపీలో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలోంచి ఐదుగురిని మేం తీసుకుంటే ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే.. నాకు, చంద్రబాబుకు తేడా ఉండదు. ఒకవేళ ఎమ్మెల్యేలను తీసుకోవాలనుకుంటే.. వారితో రాజీనామా చేయించే తీసుకుంటాం. కానీ గత ప్రభుత్వం సభా సంప్రదాయాలను పట్టించుకోలేదు. గతంలో ప్రతిపక్ష నేతను సభలో మాట్లాడనివ్వలేదు. అలాంటి విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుంది. స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే.. స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటుంది’ అని జగన్ అన్నారు.