ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ ప్లీనరీ   - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ ప్లీనరీ  

March 17, 2018

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కాంగ్రెస్ ప్లీనరీలో తీర్మానం చేశారు. శనివారం ఢిల్లీలో పార్టీ  84వ ప్లీనరీ ఘనంగా ప్రారంభమైంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జాతీయ జెండాను ఎగరేసి ప్లీనరీని ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, అయితే మోదీ ప్రభుత్వం దాన్ని తుంగలోకి తొక్కిందన్నారు. తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని స్పష్టం చేశారు.మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని రాహుల్ అన్నారు. దేశప్రజలందరూ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారని, దేశాన్ని ఏకం చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందని పేర్కొన్నారు.  ‘ఈ దేశం ప్రజలందరిది. అన్ని కులాలు, అన్ని మతాలవారిది. మా పార్టీ ర్టీ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తుంది. బీజేపీవి ఆగ్రహ, విద్వేష పూరిత రాజకీయాలు, మావి ప్రేమపూరిత రాజకీయాలు… బీజేపీ దేశాన్ని ముక్కలు చేస్తోంది.  కాంగ్రెస్ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.’ అని ఆయన పేర్కొన్నారు. ప్లీనరీ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లీనరీలో తీర్మానం చేశారు. ఈ హామీకి కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. రాహుల్ అధ్యక్షుడయ్యాక జరుగుతున్న తొలి ప్లీనరీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.