అయ్యో ఏపీ.. ఒక్క రోజే 24 మంది మృతి..  - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో ఏపీ.. ఒక్క రోజే 24 మంది మృతి.. 

July 14, 2020

corona cases

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేనేలేవు. గత 24 గంటల్లలో 43 మంది ఈ వైరస్‌తో కన్నుమూశారు. నిబంధనలli పటిష్టంగా అమలు పరుస్తున్నా రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తుండడం గమనార్హం. మొత్తం మృతుల సంఖ్య 408కి చేరింది. ఏపీలో కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1916 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 238 కేసులు నమోదయ్యాయి.  శ్రీకాకుళం జిల్లాలో 215 మందికి వ్యాధి సోకింది. మొత్తం కేసులు 33,019గా నమోదయ్యాయి. 15,144 మంది చికిత్స పొందుతున్నారు.

తాజా మరణాల్లో లెక్కలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది, చిత్తూరు జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, కడప జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు.