ఏపీ కరోనా షాక్.. 87 కేసుల్లో 70 ఢిల్లీ మర్కజ్‌వే  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ కరోనా షాక్.. 87 కేసుల్లో 70 ఢిల్లీ మర్కజ్‌వే 

April 1, 2020

Andhra Pradesh corona cases linked to delhi nijamuddin markaz prayers

ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నానికి కొత్తగా 43 కేసులు చేరగా మరొక దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీతో సంబంధముందని తేలింది. ఈ 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారితో సంబంధమున్నవేనని, సీఎం జగన్ ఈ రోజు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి వైరస్ సోకిందని అన్నారు.

మర్కజ్ వెళ్లొచ్చిన వారు అవమానంగా భావించకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ‘ఇది మచ్చేమీ కాదు. ఎవరూ భయపడకండి. కరోనా సోకిన వారు చాలామంది కోరుకున్నారు. నిర్లక్ష్యం చేస్తే మరింత మందికి సోకొచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోండి. 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సాయం కోరండి..’’ అని సూచించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు ఏపీ నుంచి వెయ్యిమందికిగా వెళ్లొచ్చారని, కరోనా వ్యాపించకుండా వారంతా వైద్యం చేయించుకోవాలని, వారి కుటుంబసభ్యులకు కూడా వివరాలను బయటికి చెప్పాలని ఆయన పదే పదే అర్థించారు.