కరోనా మారణకాండ.. ఏపీలో మళ్లీ 97 మంది మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా మారణకాండ.. ఏపీలో మళ్లీ 97 మంది మృతి 

August 14, 2020

Miscreants throw SDPI flag on Shankaracharya statue in Sringeri, devotees stage protest..

మిగతా దక్షిణాది రాష్ర్టాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అదుపులోకి రావడం లేదు. కొన్నాళ్లుగా రోజుకు సగటున 10 వేల కేసులు, వంద మరణాలు సంభవిస్తున్నాయి. గత 24 గంటల్లో మరో 97 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 12 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది మరణించారు. తాజా లెక్కలతో రాష్ట్రోం మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,475కి పెరిగింది.

కేసుల సంఖ్యగా కూడా భారీగా పెరిగింది.  24 గంటల్లో 8,943 మంది కరోనా బారినపడ్డారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,146 మందికి వ్యాధి సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కి  పెరిగింది. గత 24 గంటల్లో 9,779 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,80,703 మంది కోలుకోగా, 89,907 మంది ఆస్పత్రుల్లో, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 38292 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 32012కు చేరాయి.. అనంతపురం జిల్లాలో 28096 కేసులు ఉన్నాయి.