ఏపీలో డీఎడ్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే  - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో డీఎడ్ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే 

September 26, 2020

vcngvn

అన్‌లాక్ ప్రక్రియ తర్వాత దేశంలో మెల్లమెల్లగా అన్ని కార్యకలాపాలు మొదలు అవుతున్నాయి. ప్రవేశ పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలో డీఎడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల అక్కడి ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. సోమవారం ఇవి జరగాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో పరీక్షలను వాయిదా వేయశారు. త్వరలోనే షెడ్యూల్ మళ్లీ ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. 

డీఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ 28 నుంచి నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి ఏర్పాట్లకు కూడా సిద్ధం అయ్యారు. అంతలోనే కరోనా వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. ప్రతి రోజూ ఏడు వేలకు తగ్గకుండా బాధితులు వస్తుండటంతో ఈ పరీక్షలు జరపడం కష్టమేనని అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితిలో పరీక్షలు వద్దనే అభిప్రాయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అయింది. దీంతో వాటిని వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత వీటిని నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.