జగనన్న పాటకు ఎమ్మార్వో డాన్స్..కొరడా ఝుళిపించిన అధికారులు - MicTv.in - Telugu News
mictv telugu

జగనన్న పాటకు ఎమ్మార్వో డాన్స్..కొరడా ఝుళిపించిన అధికారులు

November 21, 2019

ప్రభుత్వ అధికారులకు కొన్ని పరిమితులుంటాయి. వాటికి లోబడి వారు పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమంగా రాజకీయ పార్టీలకు వాటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. కానీ, ఓ ప్రభుత్వ అధికారి అధికార పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా రాజకీయ పాటకు డ్యాన్స్ చేయడం ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తి రేపుతోంది. 

పాలకొండ నియోజకవర్గానికి చెందిన స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు భామిని సమీపంలోని ఓ తోటలో కార్తీక మాసం సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి భామిని మండలం ఎమ్మార్వోగా పనిచేస్తున్న నరసింహమూర్తితో పాటు మిగిలిన ఎమ్మార్వో కార్యాలయ సిబ్బందిని ఆహ్వానించారు. దీంతో నరసింహమూర్తి తన సిబ్బందితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అక్కడ జగనన్న పాటకు కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ దృశ్యాలను అక్కడి వాళ్లలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడిాయాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ నివాస్ ఆదేశాలతో ఎమ్మార్వోకు పాలకొండ ఆర్డీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక పార్టీకి చెందిన ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా.. జగనన్న పాటకు డ్యాన్స్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎమ్మార్వోపై శాఖాపరంగా కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.