ఏపీ డిప్యూటీ సీఎంతో కుటుంబంలో కరోనా కలకలం! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ డిప్యూటీ సీఎంతో కుటుంబంలో కరోనా కలకలం!

July 13, 2020

nvnhb

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున వెయ్యి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 

కడప జిల్లాలో ఆయన కుటుంబానికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో డిప్యూటీ సీఎంతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో వారంతా శుక్రవారం అర్ధరాత్రి తిరుపతిలోని కొవిడ్ ఆసుపత్రిలో చేరారు. వీరి ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నిన్న వీరు తిరుపతి నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్టు వైద్యాధికారులు తెలిపారు.