ఏపీలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో స్థానిక ఎన్నికలు మళ్లీ వాయిదా..

May 6, 2020

Andhra Pradesh election commission postponed local elections

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలను ఈసీ మరోసారి వాయిదా వేసింది. లాక్‌డౌన్, కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ నుంచి వ్యతిరేక స్పందన తదితర కారాణాలతో పోలింగ్ ఇప్పట్లో సాధ్యమయ్యలే లేదు. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నికలు వాయిదా పడ్డ సంగతి తెలిసేందే. మార్చి 15 జరగాల్సి ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. ఆ గడువు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్  కనగరాజ్ ఈ రోజు అధికారులతో కలసి పరిస్థితిని సమీక్షించారు. 

లాక్ డౌన్, హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుకుని  స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తున్నామని భేటీ తర్వాత కమిషన్ ఓ ప్రకటనతో తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల ప్ర్రక్రియను పూర్తిగా నిలిపేయాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు పంపింది. కరోనా తగ్గాక పరిస్థితిని బట్టి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. మరోపక్క..మద్యం దుకాణాలకు అనుతిచ్చినట్లే భౌతిక దూరం పాటిస్తూ ఎన్నికలకు కూడా అనుమతివ్వాలని వైకాపా శ్రేణులు ప్రచారం ప్రాభించాయి.  సోషల్ మీడియా గ్రూపుల్లో దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. దక్షిణ కొరియాలోనూ కరోనా మధ్యే ఎన్నికలు దిగ్విజయంగా ముగించారని చెప్పుకొస్తున్నారు.