ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ ఆత్మహత్య

September 16, 2019

KODELA MAN.

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరివేసుకోవడంతో గమనించిన ఆయన కుటుంబ సభ్యులు బసవతారకం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందించిన వైద్యులు చివరికి మరణించినట్టు ప్రకటించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించిన వైద్యులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల మరణం పట్ల టీడీపీ ముఖ్యనేతలు విచారం వ్యక్తం చేశారు.