లొంగిపోయిన కోడెల శివప్రసాద్ కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

లొంగిపోయిన కోడెల శివప్రసాద్ కొడుకు

October 1, 2019

kodela shivaprasad....

టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు శివరామ్ ఈరోజు నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు లొంగిపోయారు. టీడీపీ పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో తండ్రి కోడెల శివప్రసాద్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలకు, అక్రమాలకు పాల్పడ్డారని, కే ట్యాక్స్ పేరిట అక్రమ వసూళ్లు చేశారని శివరామ్‌పై ఆరోపణలు ఉన్నాయి.

వైఎస్సార్‌సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివరామ్‌తోపాటు ఆయన సోదరిపై కూడా 19 కేసులు నమోదయ్యాయి. తాజాగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంలో ఆయన మేనల్లుడు కూడా శివరామ్‌పై కేసు పెట్టారు. ఈ క్రమంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ, ముందస్తు బెయిల్ కోసం శివరామ్ హైకోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకోవచ్చన్న హైకోర్టు సూచనలతో కోడెల శివరామ్ మంగళవారం నరసరావుపేట కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆయనకు ఆరు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో లొంగిపోయే ముందే ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది. కాసేపట్లో ఆయన బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.