కోడెలను జగనే చంపేశాడు… టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వేధింపుల వల్ల ఆయన చనిపోయారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది పక్కా రాజకీయ హత్య అని, దీనికి జగనే బాధ్యుడని ఆరోపించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, కోడెల ఆత్మహత్యపైన అనుమానాలు ఉన్నాయన్నారు.
‘కోడెల మెడపై గాట్లు ఉన్నాయి. ఆయనను ఉదయం 11.30 గంటలకు బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారు.. వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.., ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే ఆయన కన్నుమూశారు..’ అని వెల్లడించారు. బసవతారకం హాస్పిటల్ ఫౌండర్, ఛైర్మన్‌గా ఉన్న ఆయన అదే ఆస్పత్రిలోనే చనిపోవడం బాధాకరమన్నారు. మరో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ..కోడెలను జగన్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని ఆరోపించారు.విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదని, ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి దారుణంగా హత్యచేశారని ఆరోపించారు.
This is not suicide a brutal murder by Chief Minister@ysjagan pic.twitter.com/xtRSDaHWOu
— Kesineni Nani (@kesineni_nani) September 16, 2019