కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి 

August 1, 2020

Andhra pradesh former miniser manikyalarao passed away

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కాసేపటి కిందట కరోనా వైరస్‌తో కన్నుమూశారు. నెల రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే చనిపోయారు. ఆయకు ఓ మిత్రుడి నుంచి కరోనా సోకింది. కరోనా గురించి భయపడాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఇటీవల చెప్పారు. 60 ఏళ్ల మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి తొలిసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. టీడీపీ సంకీర్ణ సర్కారులో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పలు వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. 

పశ్చిమగోదావరికి చెందిన మాణిక్యాలరావు రాజకీయాల్లోకి రాకముదు ఫొటో గ్రాఫర్‌గా పనిచేశారు.  ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. మాణిక్యాల రావు చిన్నప్పటి నుంచి ఆరెస్సెస్ భావజాలానికి ప్రభావితం అయ్యారు. పలు సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు.