మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వచ్చే ఏపీ ఎన్నికలపై జరిపిన సర్వే ఫలితాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా లేకపోయినా, చేసిన సర్వే మాత్రం మాత్రం రచ్చకు దారితీస్తోంది. అది చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా ఉండడమే కారణం. కాపు వర్గం నేత అయిన జోగయ్య పవర్ స్టార్ వైపు మొగ్గు చూపడం సహజమేనని వైసీపీ శ్రేణులు తిప్పికొడుతుంటే, జగన్ హవా తగ్గుతోందనడానికి ఇది నిదర్శమని టీడీపీ, జనసేన శ్రేణులు ఎదురుదాడికి దిగుతున్నాయి.
బస్సుయాత్ర పూర్తయితే ఇలా, కాకపోతే అలా…
జోగయ్య సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. టీడీపీకి 70 సీట్లు, వైసీసీకి 55, జనసేనకు 50 సీట్లు వస్తాయి. పవన్ తన వారాహి బస్సు యాత్రనాటికి బీజేపీతో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తే 20 సీట్లు రావొచ్చు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగితే 55 సీట్లు, 8 శాతం ఓట్లు దక్కొచ్చు. వైసీపీకి 47 శాతం ఓట్లు, 100 సీట్లు వస్తాయి. పవన్ బస్సు యాత్ర పూర్తయితే ఆయనకు 35 సీట్లు దక్కొచ్చు. వైసీపీకి 80 రావొచ్చు. జనసేన, టీడీపీతో పొత్తుకుంటే టీడీపీకి 70, జనసేకు 50 వచ్చే అవకాశముంది. వైసీపీకి 55 సీట్లు వరకు రావొచ్చు. ఇదే జరిగితే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారు. సీఎం కూడా అయ్యే అవకాశముంది. కాగా, ఈ సర్వే పిచ్చి సర్వే అని వైపీపీ శ్రేణులు తిట్టిపోస్తుంటే, ఆయన వాస్తవ పరిస్థితే చెప్పారని టీడీపీ, జనసనే అభిమానులు అంటున్నారు.