కల్లుగీత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

కల్లుగీత కార్మికులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

November 1, 2022

కల్లుగీత కార్మికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే నష్టపరిహారాన్ని భారీగా పెంచింది. ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్‌ బీమా ద్వారా.. మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది.

కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుంది. మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికులను ప్రోత్సాహించేందుకు ఈ విధానాన్ని ప్రకటించారు. .ఈ నిర్ణయాలతో రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు గీత పాలసీని తీసుకొచ్చింది ఏపీ సర్కార్