రైతు దినోత్సవంగా వైఎస్సార్‌ జయంతి - MicTv.in - Telugu News
mictv telugu

రైతు దినోత్సవంగా వైఎస్సార్‌ జయంతి

June 29, 2020

cm ysr.

జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి (జులై 8)ని రైతు దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించింది. 

ప్రతి సంవత్సరం వైఎస్సార్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని..ఆయన సంస్మరణార్థం రైతు దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.