ఆంధ్రప్రదేశ్లో కుల పదాలపై నిషేధాలు కొనసాగున్నాయి. నాయిబ్రాహ్మణులను ‘మంగలి’ అని పిలవకుండా ఇటవల నిషేధం విధించిన జగన్ ప్రభుత్వం తాజాగా మరో బీసీ కుల సంబంధమైన పదంపై వేటు వేసింది. రాష్ట్రంలో ఇకపై ‘భట్రాజు పొడగ్తలు’ అని పలకొద్దని ఆదేశాలు జారీ చేసింది. రాజకీయాల్లో, సినిమా కామెడీ సన్నివేశాల్లో ఈ పదాన్ని తరచూ వాడుతున్నారని, ఇది తమ కులాన్ని కించపరిచేలా ఉందని భట్రాజ సామాజికవర్గం ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదాన్ని పలకకూడదని, సినిమాలు, టీవీ సీరియళ్లలోనూ దీన్ని వాడకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయంపై భట్రాజులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, జగన్ ప్రభుత్వం వివిధ కులాలను ఆకట్టుకోవడానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కులాల పేర్లతో కమిషన్లు కూడా ఏర్పాటు చేసింది.