10వ తరగతి పరీక్షలపై ఏపీ సంచల నిర్ణయం.. ఎన్ని పేపర్లంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

10వ తరగతి పరీక్షలపై ఏపీ సంచల నిర్ణయం.. ఎన్ని పేపర్లంటే..

May 14, 2020

ppp

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ మూతపడ్డాయి. బోర్డు, పోటీ పరీక్షలు ఆగిపోయాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కానీ, బోర్డు పరీక్షలను మాత్రం జరిపి తీరుతామని చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే పదో తరగతికి నిర్వహించే 11 పేపర్లను 6కు కుదించింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఈ సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉండేవి. ఒక హిందీకి మాత్రం ఒక పేపర్ ఉండేది. పరీక్షల సమయాల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది.

 

పదో తరగతి పరీక్షల వివరాలు:

 

* జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్

* జులై 11న సెకండ్ లాంగ్వేజ్

* జులై 12న ఇంగ్లీష్ పరీక్ష

* జులై 13న మ్యాథ్స్ పరీక్ష

* జులై 14న సైన్స్ పరీక్ష

* జులై 15న సోషల్ పరీక్ష