చంద్రబాబు దీక్షకు నో పర్మిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు దీక్షకు నో పర్మిషన్

November 8, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత ఇంకా కొనసాగుతోంది. దీంతో భవననిర్మాణ కార్మికులు ఉపాధి లేక అనేక ఇబ్బదులు ఎదురుకుంటొన్నారు. ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టిన సంగతి తెల్సిందే. 

chandrababu ..

ఈ క్రమంలో భవననిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్‌, మున్సిపల్‌ కమిషనర్లను టీడీపీ కోరింది. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీస్, మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు తలపెట్టిన దీక్ష కొనసాగుతుందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా ధర్నాచౌక్‌ను పరిశీలిస్తున్నట్లు వారు తెలిపారు.