కరోనా టైమ్స్ లో..'జూడా'లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టైమ్స్ లో..’జూడా’లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

August 12, 2020

andhra pradesh government good news for junior doctors.

కరోనా విపత్కర సమయాల్లో ముందుండి పోరాడుతున్న జూనియర్ డాక్టర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూనియర్ డాక్టర్ స్టైఫండ్‌ను పెంచుతూ ఈరోజు ఏపీ వైద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2020 జనవరి 1 నుండి పెరిగిన స్టైఫండ్ అమల్లోకి రానుంది.

 

ఎవరెవరికి ఎంత స్టైఫండ్ అంటే..

 

* ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు రూ.15,589,

* పీజీ ఫస్టియర్‌ విద్యార్థులకు రూ.44,075,

* పీజీ సెకండియర్‌ విద్యార్థులకు రూ.46,524,

* పీజీ థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973,

* పీజీ డిప్లొమా ఫస్టియర్‌- రూ.44,075, 

* పీజీ డిప్లొమా సెకండియర్‌- రూ.46,524,

* ఎండీఎస్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు రూ.44,075, 

* ఎండీఎస్ సెకండియర్‌ విద్యార్థులకు రూ.46,524,

* ఎండీఎస్‌ థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973,

* సూపర్‌ స్పెషాలిటీ ఫస్టియర్‌ విద్యార్థులకు రూ.48,973,

* సూపర్‌ స్పెషాలిటీ సెకండియర్‌ విద్యార్థులకు రూ.51,422,

* సూపర్‌ స్పెషాలిటీ థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.53,869.