అమరావతి.. హైకోర్టులో జగన్‌కు మళ్లీ షాక్..  - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి.. హైకోర్టులో జగన్‌కు మళ్లీ షాక్.. 

September 16, 2020

 

jagan

అమరాతి భూముల వివాదాలు ఎంతకూ తెగడం లేదు. రాజధానిని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో అక్కడి భూముల విషయంలో ఏం చేయాలన్నదానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చుక్కెదురైంది. ఈ విషయంలో ముందుకెళ్లొద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. భూములపై జగన్ ప్రభుత్వం సిట్‌ను, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా కోర్టుకెక్కారు. దీనిపై  ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు  తీర్పును రిజర్వ్ ఉంచుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఆదేశాలు లేకుండా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని స్పష్టం చేసింది. 

టీడీపీ హయాంలో అమరావతి సీఆర్డీఏ భూముల సేకరణలో అవినీతి, ఇన్‌సైడ్ ట్రేడింగ్, బినామీలు అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించడ తెలిసిందే. ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి అధ్యక్ష్తన పది మంది సభ్యులతో ఇది ఏర్పాటైంది. అలాగే అక్రమాలపై నివేదిక కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా జగన్ ఏర్పాటు చేశారు.