కొత్త సంవత్సరం వచ్చేస్తున్న నేపథ్యంలో జగన్ సర్కారు తన ఉద్యోగులకు చిరు ఊరట కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో తమ చేతిలో ఉంచుకోవాల్సిన నగదు మొత్తం పరిమితిని పెంచింది. ప్రస్తుతం వీరు కేవలం రూ. 500 మాత్రమే క్యాష్ ఇన్ హ్యాండ్‌గా ఉంచుకోవాల్సి ఉండగా ఈ మొత్తాన్ని రూ. 1000కి పెంచింది. తక్కువ డబ్బుతో సమస్యలు, మారిన పరిస్థితులు, వెయ్యికి పెంచాలన్న ఏసీబీ సిఫార్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పర్యటనలో ఉంచుకోవాల్సిన రూ.10 వేల పరిమితిని మాత్రం అలాగే ఉంచింది. డిజిటల్ పేమెంట్స్ పెరిగడంతో చేతిలో క్యాష్ పెద్దగా అక్కర్లేదని, అయినా సరే కనీసం వెయ్యి అయినా ఉండాలని ఏసీబీ చేసిన సిఫార్సును ప్రభుత్వం ఆమోదించింది.