ఇసుక వెబ్‌సైట్ హ్యాక్..సీఐడి దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇసుక వెబ్‌సైట్ హ్యాక్..సీఐడి దాడులు

November 13, 2019

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కొనసాగుతోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మాధ్యమంగా అందరికి ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కార్యకలాపాలను ఈ బ్లూ ఫ్రాంగ్ సంస్థకు అప్పగించింది. ఇటీవల ఇసుక విక్రయాల కోసం మన సాండ్ అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది.

తాజాగా ఎవరో దుండగులు మన సాండ్ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసి ఇసుక రవాణాను బ్లాక్ చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులు మన శాండ్ అనే వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఇసుక సరఫరాను బ్లాక్ చేశారని పోలీసులు, సీఐడీ అధికారులు అనుమానిస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత నేపథ్యంలో ఈఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలోని కొంతమంది ఉద్యోగులు మన శాండ్ వెబ్ సర్వర్లను హ్యాక్ చేసి కోడ్ ద్వారా ఇసుక సరఫరాలను బ్లాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ సోదాలు చేపట్టారని తెలుస్తోంది.