జగన్ సర్కారుకు చుక్కెదురు.. కొత్త మద్య విధానంపై స్టే - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ సర్కారుకు చుక్కెదురు.. కొత్త మద్య విధానంపై స్టే

December 3, 2019

Andhra Pradesh government.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన తీసుకొచ్చిన మద్య విధానంపై కోర్టు స్టే విధించింది. ఆ విధానాన్ని ఈనెల 23 వరకు అమలు చేయొద్దని ఆదేశించింది. గడుపు పూర్తికాకముందే తమ లైసెన్సులు ఎలా రద్దు చేస్తారంటూ బార్ల యజమానులు కోర్టుకెక్కారు. వారి పిటిషన్లన విచారించిన కోర్టు..  ఏ ప్రాతిపదికన కొత్త మద్యం పాలసీని రూపొందించారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం రిటైల్ ధరలు ప్రభుత్వం చేతిలో ఉంటాయని, మరి బార్లకు ధరల నిర్ణయం ఎలా జరిగిందని నిలదీసింది. ఈనెల 9లోగా వివరణ ఇవ్వాలని సర్కారును ఆదేశించింది. కోర్టు విచారణ కారణంగా వచ్చే నెల 7న జరగాల్సిన లైసెన్సుల డ్రాను 15కు వాయిదా వేస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. బార్ల లైసెన్సులను ఆరు నెలల ముందే ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే.