Home > Featured > కుటుంబరావు వంతు.. కబ్జా భూమి స్వాధీనం

కుటుంబరావు వంతు.. కబ్జా భూమి స్వాధీనం

kutumbarao.

ఏపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కొరడా ఝళిపిస్తోంది. కృష్ణానది కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నివాసం సహా పలు నిర్మాణలకు తొలగిస్తున్న టీడీపీ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఆయన కుటుంబ సభ్యులు విజయవాడ మధురానగర్‌లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నిర్ధారించి స్వాధీనం చేసుకుంది.

ఈ రోజు రెవెన్యూ అధికారులు కబ్జాస్థలంలోని సామగ్రిని, బోర్డులను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అండతో కుటుంబరావు కుటుంబ సభ్యులు రూ. రూ.200 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని జగన్ ప్రభుత్వం చెబుతోంది. నిందితులు రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా రిజిస్టర్ చేసుకున్నారని అంటోంది. ఈ ఆరోపణలను ఆయన ఖండిస్తున్నారు. కేసుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని, ప్రభుత్వం తమకు కనీసం నోటీసు ఇవ్వకుండా ఎలా స్వాధీనం చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.

Updated : 13 Sep 2019 7:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top