టీటీడీ భూముల వేలానికి బ్రేక్..ఉత్తర్వులు జారీ - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భూముల వేలానికి బ్రేక్..ఉత్తర్వులు జారీ

May 25, 2020

ttd

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులను వేలం వేయాలని అంశం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెల్సిందే. టీటీడీ పాలక మండలి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ..’టీటీడీ భూముల అమ్మకం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయంతీసుకొలేదు. రోడ్ మ్యాప్ మాత్రమే రెడీ చేయమన్నాం. దీనికే ఇంత రాద్ధాంతమా? తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దు.’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉంటే టీటీడీ ఆస్తుల విక్రయాలను నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2016 జనవరి 30 టీటీడీ బోర్డు తీర్మానాన్ని నిలిపివేసింది. నాడు చేసిన తీర్మానంలో టీటీడీకి చెందిన 50 భూములను విక్రయించాలని అప్పటి బోర్డు నిర్ణయించింది. ఆ తీర్మానాన్ని తాజాగా ఏపీ సర్కార్ నిలిపివేసింది. భూముల విక్రయానికి సంబంధించి ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక వేత్తలతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో పేర్కొంది. సంప్రదింపులు పూర్తయ్యే వరకు భూముల విక్రయ ప్రక్రియను నిలిపిివేస్తున్నట్లు తెలిపింది.