అమర్‌రాజా కంపెనీకి జగన్ బిగ్ షాక్..భూములు వెనక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

అమర్‌రాజా కంపెనీకి జగన్ బిగ్ షాక్..భూములు వెనక్కి..

June 30, 2020

Andhra pradesh government takes back amara raja lands

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంది.  చిత్తూరు జిల్లాలోని బంగారుపాళెం నునిగుండ్లపల్లి, కొత్తపల్లిలోని సర్వే నెం 65/1 లో ఉన్న అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు సంబంధించిన 253 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏపీ ప్రభుత్వం ఏపీఐఐసీ కింద అమర్ రాజా ఇన్‌ఫ్రాటెక్‌కు 483.27 ఎకరాలు కేటాయించింది. వాటిలో ఆ సంస్థ కేవలం 253.61 ఎకరాలను మాత్రమే ఉపయోగిస్తుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

గత పదేళ్లుగా 229.66 ఎకరాలు మాత్రమే వినియోగించారని చెప్పింది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టలేదని తెలిపింది. అగ్రిమెంట్‌లో చెప్పిన విధంగా రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టడంలో కానీ, 20 వేల ఉద్యోగాల కల్పనకు చేసిన హామీలు నిలబెట్టుకోవలేదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అమర్‌రాజా ఇన్‌ఫ్రాటెక్‌ ఇప్పటివరకు కేవలం 4310 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించింది. ఈ మేరకు మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది.