పలు సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బోలెడు పథకాలు ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం ఆలయాల్లో పనిచేసే అర్చకులకు తీపి కబురు చెప్పింది. ఇకపై వారికి వైద్య ఖర్చులను మొత్తం తామే భరిస్తామని హామీ ఇచ్చింది. అర్చకుల వైద్య ఖర్చులను వందకు వంద శాతం రీయింబర్స్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ శనివారం వెల్లడించారు. అర్చకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని, దీనస్థితిలో ఉన్నవారి పూజారులను ఆదుకుంటామని చెప్పారు. అర్చకులతోపాటు ముల్లాల, పాస్టర్ల జీతాలను జగన్ ప్రభుత్వం భారీగా పెంచడం తెలిసిందే. వీరికి ఆయా మందిరాల ఆదాయం, స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి 15వరలకు గౌరవ వేతనం లభిస్తోంది.