ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైరస్ చికిత్స - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా వైరస్ చికిత్స

July 8, 2020

aarogyasri

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. సగటున రోజుకి వెయ్యి కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సోకిన వారితో పాటు కాంటాక్ట్ అయిన వారికి కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో కరోనా రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా అనుమానితులు, నిర్ధారణ అయిన వారి చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చుల వివరాలను కూడా ప్రకటించారు. కరోనా చికిత్సకు రోజుకు 3250 రూపాయలు.వెంటిలేటర్, ఎన్ఐవి లేకుండా ఐసియూలో చికిత్స పొందితే రోజుకు 5480 రూపాయలు. ఎన్ఐవి ఉండి ఐసియూలో చికిత్స పొందుతే రోజుకి 5980 రూపాయలు. వెంటిలేటర్ ఉండి ఐసియూలో చికిత్స పొందుతుంటే రోజుకి 9580 రూపాయలు. వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలుగా నిర్ణయించారు.