ఏపీలో 18 దాటిన వారికీ వ్యాక్సీన్.. నైట్ కర్ఫ్యూ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో 18 దాటిన వారికీ వ్యాక్సీన్.. నైట్ కర్ఫ్యూ

April 23, 2021

Andhra Pradesh Government vaccine to 18 years above people

ఆంధ్రప్రదేశ్‌లోనూ రాత్రి కర్ఫ్యూ విధించారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో ఈ రోజు(శుక్రవారం) రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు. కఠినంగా అమలు చేస్తామని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

మరో పక్క.. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 2 కోట్ల 4 లక్షల మందికి ఉచితంగా టీకా డోసులు అందిస్తామని పేర్కొన్నారు. మే 1 నుంచి వీరికి టీకాలు వేస్తామని తెలిపారు. అయితే కేంద్రం రాష్ర్టాలకు తగినన్ని డోసులు ఇవ్వని నేపథ్యంలో ఇది అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. తమకు 2 లక్షలకుపా వయల్స్ కావాలని కోరితే 21 వేలు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీలో దాదాపు పది లక్షల కరోనా కేసులు 8 వేల మరణాలు సంభవించాయి. తెలంగాణలో 4 లక్షలకుపైగా కేసులు 2 వేల మరణాలు నమోదయ్యాయి.