హమ్మయ్య.. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఓకే  - MicTv.in - Telugu News
mictv telugu

హమ్మయ్య.. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఓకే 

July 31, 2020

Andhra pradesh governor say yes to three capitals bill.

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో పాటు గత టీడీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఆమోదించారు. ఈ ఆమెదంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూల్, పాలనా రాజధానిగా అమరావతి ఏర్పడనున్నాయి. 

ఈ ఏడాది జనవరి 20న ఈ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కానీ, శాసనమండలిలో ఈ బిల్లులకు చుక్కెదురైంది. మండలిలో టీడీపికీ మెజారిటీ ఎక్కువగా ఉండడంతో ఈ బిల్లుని అడ్డుకోగలిగింది. దీంతో ఈ బిల్లులను శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. జూన్ 16న రెండోసారి ఈ రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర వేసి, ఆ తర్వాత, శాసన మండలికి పంపింది. తాజాగా ఈ బిల్లుకి గవర్నర్ ఆమోదముద్ర పడింది.