ఢిల్లీకి పోవాలంటే భయమేస్తోంది..ఏపీ గవర్నర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీకి పోవాలంటే భయమేస్తోంది..ఏపీ గవర్నర్

December 12, 2019

Andhra pradesh governor.

ఢిల్లీకి పోవాలంటే భయమేస్తోంది..ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. స్వయంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఈ వ్యాఖ్యల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనకుంటే పొరబడినట్లే. ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది వాతావరణాన్ని ఉద్దేశించి. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన బుధవారం విజయవాడ లయోలా కాలేజీలో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’వాతావరణంలో వస్తోన్న మార్పులు భావితరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలి. ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా కొనసాగించాలి. గత రెండు, మూడు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం సృష్టించిన ఇబ్బందులు అందరికీ తెలిసినవే. ఢిల్లీ పర్యటనకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు తలెత్తాయి.’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత విద్యార్థులతో కలసి కళాశాల ఆవరణలో 1000 మొక్కలు నాటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన రెడ్‌క్రాస్‌ సొసైటీని ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు.