ప్రభుత్వ సెలవు దినాలు ఇవే - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభుత్వ సెలవు దినాలు ఇవే

November 1, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాది (2018)లో మంజూరు చేసే సెలవు దినాల వివరాలను ప్రకటించింది. సాధారణ సెలవులతోపాటు ఐచ్ఛిక సెలవులు వంటి సమాచారాన్ని సాధారణ పరిపాలన శాఖ వెలువరించింది.

19 సాధారణ సెలవులు, 20 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. నాలుగు సాధారణ సెలవులు, నాలుగు ఐచ్ఛిక సెలవులు రెండో శనివారం, ఆదివారాల్లో వచ్చాయి. సాధారణ సెలవుల్లో భోగి (జనవరి 14, ఆదివారం), ఉగాది (మార్చి 18, ఆదివారం), శ్రీరామనవమి (మార్చి 25, ఆదివారం), అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14, శనివారం) సెలవు రోజుల్లో వచ్చాయి. ఇక ఐచ్ఛిక సెలవులుగా న్యూ ఇయర్,  శ్రీపంచమి, హరజత్ మహ్మద్, జువన్ పరి జయంతి, మహావీర్ జయంతి, బసవ జయంతి, బుద్ధ పూర్ణిమ, సబ్-ఇ-బరాత్, షహాదత్ హజరత్ అలీ, సబ్-ఇ-కదిర్, జమ్మాతుల్ వద, పార్శీ న్యూ ఇయర్, వరలక్ష్మీ వ్రతం, ఈల్-ఇ-షుదీర్, 3వ మొహరం, మహాలయ అమావాస్య, అర్బయీన్, నరక చతుర్ధి, కార్తీక పౌర్ణమి / గురునానక్ జయండి, క్రిస్మస్ ఈవ్, బాక్సింగ్ డేలను ప్రకటించారు. 

సాధారాణ సెలవులు
సంక్రాంతి : జనవరి 15, సోమవారం
కనుమ: జనవరి 16, మంగళవారం
రిపబ్లిక్ డే: జనవరి 26, శుక్రవారం
మహాశివరాత్రి: ఫిబ్రవరి 13, మంగళవారం
హోలీ: మార్చి 2, శుక్రవారం
గుడ్ ఫ్రైడే: మార్చి 30, శుక్రవారం
బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి: ఏప్రిల్ 5, గురువారం
ఈదుల్ ఫితర్: మే 16, శనివారం
స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15, బుధవారం
బక్రీద్: ఆగస్టు 22, బుధవారం
శ్రీకృష్ణాష్టమి: సెప్టెంబర్ 3, సోమవారం
వినాయకచవితి: సెప్టెంబర్ 13, గురువారం
మొహర్రం: సెప్టెంబర్ 21, శుక్రవారం
గాంధీ జయంతి: అక్టోబర్ 2, మంగళవారం
దుర్గాష్టమి: అక్టోబర్ 17, బుధవారం
విజయదశమి: అక్టోబర్ 18, గురువారం
దీపావళి: నవంబర్ 7, బుధవారం
మిలాదున్ నబీ : నవంబర్ 21, బుధవారం
క్రిస్మస్: డిసెంబర్ 25, మంగళవారం