అమెరికాలో ‘బాంబ్’ మంచు తుపాను విలయం సృష్టిస్తోంది. పదుల సంఖ్యలో జనం చనిపోయారు. వేలమంది గాయపడుతున్నారు. న్యూజెర్సీలో చనిపోయిన మృతుల్లో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారు. అరిజోనాలో వెల్లువెత్తిన తుపాను గుంటూరుకు చెందిన ముద్దన నారాయణ, హరిత అనే దంపతులు చనిపోయారు. ఐస్ లేక్ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేకుంది. మంచులో చిక్కుకుపోయిన వీరిని కాపాడేంతుకు సహాయక బలగాలు విశ్వప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. మృతులది పెదనందిపాడు మండలం పాలపర్రు. వీరికి ఇద్దరు పిల్లలు. తుపాను దృశ్యాలను చూడ్డానికి బయటికి వెళ్లిన వీరు పిల్లలను సురక్షిత ప్రాంతంలో ఉంచారు. తర్వాత భారీ మంచుగడ్డపై నిలబడి ఫోటోలు తీసుకుంటుండగా మంచుగడ్డ భూమిలోపలికి కుంగిపోయిందని బంధువులు చెప్పారు. హరిత మృతదేహం దొరికిందని, నారాయణ మృతదేహం కోసం గాలిస్తున్నామని అమెరికా అధికారులు చెప్పినట్లు వెల్లడించారు.
మంచు బీభత్సం
అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇళ్లకు కరెంటు నిలిచిపోవడంతో వేణ్నీళ్లు దొరక్క అల్లాడుతున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల చప్పగా సాగుతునన్నాయి. 16 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశ జనాభాలో 60 శాతం మంది ప్రతికూల వాతావరణంతో ఇబ్బంది పడుతున్నారు.