బ్రేకింగ్.. 3 రాజధానులకు హైకోర్టు బ్రేక్  - MicTv.in - Telugu News
mictv telugu

బ్రేకింగ్.. 3 రాజధానులకు హైకోర్టు బ్రేక్ 

August 4, 2020

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మూడు రాజధానుల అమలు విషయంలో  యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు జగన్  ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రాజధానుల అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఈ రోజు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని  అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించగా, పది రోజుల గడువు కావాలని ఆయన కోరారు.దీనిపై స్పందించిన కోర్టు.. ఈ విషయంలో ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఇటీవ ఆదేశించడం తెలిసిందే. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ రోజు కోర్టు విచారణకు ముందు అమరావతి రైతులు రెండు కి.మీ. పొడవునా రోడ్డుపై నిలబడి తమకు న్యాయం చేయాలని న్యాయమూర్తులను కోరారు. రాజధానిని అమరావతి నుంచి తరలించి కర్నూలులో హైకోర్టును, విశాఖలో సచివాలయాన్ని, అమరావతిలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే.